కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో మానకొండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. గన్నేరువరం మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల తర్వాత ఎందరో నాయకులు ఈ నియోజకవర్గంలో పార్టీ వదిలి వెళ్ళిపోయిన కార్యకర్తలు మిగిలిపోయారు. ఆ కార్యకర్తలే నన్ను భుజాల మీద మోసి ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించారు.మీ అందరికి రుణపడి ఉంటానని అన్నారు, గన్నేరువరం మండలంలో నేను గడప గడపకు తిరిగినప్పుడు నాతో నడుచిన కార్యకర్తలను బెదిరింపులకు గురి చేసిన కవ్వంపల్లి సత్యనారాయణ వెంట లీడర్ లేడు నలుగురు పోరగాళ్ళును వెంట వేసుకొని తిరిగితే ఎమ్మెల్యేగా గెలుస్తాడా అని ఎగతాళి చేసిన మీరందరు నా వెంట నడిచారు అని అన్నారు. మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో మనం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నాం, ఈ గ్యారంటీలను పేద ప్రజలకు అందించడానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలి అని తెలిపారు.
ఈ నెల 11న ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఐదు లక్షలు అందించే కార్యక్రమాన్ని కూడా ప్రారంబించుకోబోతున్నాం అన్నారు, మీరు ఏ విధంగా అయితే నన్ను గెలిపించి శాసనసభకు పంపించారో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం మనందరం కష్టపడి పనిచేయాలి, కేంద్రంలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వ్యవస్థలను, సంస్థలను నాశనం చేస్తూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వలను కూలగోడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది,ఇక్కడ గెలిచిన పార్లమెంట్ సభ్యుడు కూడా ఏరోజు అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు కేవలం ఎన్నికల ముందు వచ్చి యాత్రలు చేస్తున్నాడు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకవచ్చిన ఎన్ఆర్ఇజిఎస్ ద్వారా వచ్చిన నిధులు తప్ప ఇప్పుడు ఉన్న పార్లమెంట్ సభ్యుడు తీసుకవచ్చిన నిధులు ఏమిలేదు అన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన కాంగ్రెస్ నాయకులకు గ్రామ శాఖ అధ్యక్షులకు శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సన్మానం చేశారు, ఈకార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,కాంగ్రెసు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కురి అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మేర రవీందర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్, తిప్పర్తి పరిపూర్ణ చారి, బీసీ సెల్ అధ్యక్షుడు మార్గం మల్లేశం,నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.