కరీంనగర్ జిల్లా: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దీపదాస్ మున్షీ , మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసిసి సెక్రెటరీ ,తెలంగాణ కో ఇంఛార్జి రోహిత్ చౌదరి,ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ చేరారు. వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సంధర్బంగా తెలంగాణ ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటి మరియు శాసనశభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ ఇంఛార్జి ,నీటి పరదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లకు ఆరేపల్లి మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.