మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి తన సొంత గ్రామమైన మాసాయిపేట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా తన గ్రామస్తులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని తన ప్రజలతో కోరారు అదే విధంగా మన మండలం అభివృద్ధి కోసం నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే త్వరగా మాసాయిపేట మండలంలో మనమే నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవచ్చని విజ్ఞప్తి చేశారు అనంతరం నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాదులో ఉండను సొంత గ్రామం మాసాయిపేటలోని ఉండి పనులు చేస్తానని తన గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు యువత గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు