contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమలు కాని హామీలను ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీయే : జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్

కరీంనగర్ జిల్లా: అమలు కానీ, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మళ్లీ అధికారంలోకి రావాలని చూసింది బిఆర్ఎస్ పార్టీయేనని బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలనీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ విమర్శించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో గీకురు రవీందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు చెప్పిన బూటకపు మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించలేదని, విజ్ఞతతో కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. అయినప్పటికీ కేటీఆర్ అహంకార పూరితంగా అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు. గత 9 సంవత్సరాల పాలనలో కొత్త రేషన్ కార్డుల జాడే లేదని, డబుల్ బెడ్ రూమ్ ఊసే లేదని, కొత్త పెన్షన్లు ఇవ్వలేదని, దళిత బంధు, బిసీ బంధు పేర ఓట్లు దండుకోవాలనుకున్నరు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, రైతులకు ఉచిత ఎరువుల పంపిణీలాంటి పథకాలను తుంగలో తొక్కారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను ఇస్తే ఒక అడుగు ముందుకేసి రైతుబంధు 15వేలు, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, వృద్ధులకు 5వేలు వికలాంగులకు 6వేలు పెన్షన్ ఇస్తామంటే ప్రజలు బిఅర్ఎస్ ను ఎందుకు నమ్మలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టిందనీ, ఇప్పటికే రెండు పథకాలు అమలయ్యాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారనీ, ప్రజా పాలనతో ప్రజలకు మరింత దగ్గరౌతున్నారనీ, ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చారన్నారు. అధికారం పోయిందని నిరాశ నిస్పృహతో అహంకారంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాగే మతి భ్రమించి మాట్లడితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలువలెరని, డిపాజిట్లు కూడా రావన్నారు. ఈ పత్రికా సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్, డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మండల ప్రధానకార్యదర్శి పూల లచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వరుకోలు సంతోష్, గట్టు ప్రశాంత్, జిల్లెల్ల రమేష్, కోనేటి రాములు, ఆకుల మల్లిఖార్జున్, కవ్వంపల్లి సంజీవ్, జిల్లెల్ల భగవాన్ ప్రసాద్, దుళిమిట్ట నర్సింహారెడ్డి, పోటు మల్లారెడ్డి, అల్లి భాస్కర్, వంగాల రాఘవ రెడ్డి, సుంకరపల్లి అంజి, ఒంటెల మల్లారెడ్డి, సురుగూరి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :