కరీంనగర్ జిల్లా: నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వాక్యాలు నిరసనగా గన్నేరువరం మండలకేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, టౌన్ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మాతంగి అనిల్, కిసాన్ సెల్ ప్రెసిడెంట్ నల్లచంద్రారెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముడికే అజయ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కళ్లెం మల్లారెడ్డి, న్యాత జీవన్, గంగాధర ఆంజనేయులు, వేదిరే విజేందర్,ఎన్ఎస్యు ఐ జిల్లా కార్యదర్శి దేశరాజు అనిల్,సతీష్ రెడ్డి,మీసం రాములు,రాపోలు నవీన్, పెంకర్ల ప్రశాంత్, ముస్కు తిరుపతి రెడ్డి, జయప్రకాష్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
