కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ, ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు వారం రోజులుగా డిసిసి అధ్యక్షుడు మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లతో ఆ పార్టీ స్థానిక నాయకులతో కలిసి చేరికలకు సంబంధించి అసమ్మతి వాదులతో మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. ఐదుగురు సర్పంచులు, ఒక ఎంపీటీసీ, ఏడెనిమిది మంది ఉప సర్పంచ్లు ఈ అసమ్మతి వర్గంలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సమయంలో చేరబోతున్నట్లు మండల వ్యాప్తంగా ప్రచారం జరిగింది. కానీ చేరుకులకు బ్రేక్ పడింది. మళ్లీ ఈ చేరికలపై మండలంలో వాడి వేడి చేర్చే కొనసాగుతుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు మండలంలో కోడైకొస్తుంది. ఇప్పటికే గన్నేరువరం మండలం పై దృష్టి సారించిన కవ్వంపల్లి, యువజన సంఘాల నాయకుడు చొక్కారావుపల్లి ఉపసర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, అతని అనుచర గణాన్ని పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇదే తరుణంలో సర్పంచులు, ఎంపీటీసీ, ఉపసర్పంచ్ చేర్చుకొని మరింత పట్టు సాధించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.