- హాజరైన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ జిల్లా: ఈ నెల 12న గన్నేరువరం మండల కేంద్రంలో జరిగే కాంగ్రెస్ పార్టీ సభను విజయవంతం చేయాలనీ
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సభకు ములుగు ఎమ్మెల్యే సీతక్క,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ,యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి మరియు ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. బీజేవైయం రాష్ట్ర నాయకులు చొక్కారావుపల్లె ఉప సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి మరియు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు యువకులు చేరనున్నారని. సాయంత్రం 4గంటలకు గుండ్లపల్లి స్టేజ్ వద్ద బైక్ ర్యాలీ ప్రారంభించి గన్నేరువరం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలనీ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులుగా ముస్కు ఉపేందర్ రెడ్డి ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిట్కూరి ఆనంత రెడ్డి గారిని నియమిస్తూ నియామక పత్రాలు అందించారు.