కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నాడంతో మండలంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నద్ధమైంది. గన్నేరువరం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి ముస్తాబయింది. రేపు బుధవారం 14వ తేదీన డీసీసీ అధ్యక్షులు మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చొక్కారావు పల్లె ఉప సర్పంచ్ యువజన సంఘాల నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.