contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రహదారి మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి

కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ : గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి గునుకుల కొండాపూర్ వరకు రహదారి మరమత్తు పనులను వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, సిపిఐ ఎంఎల్ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు సంపత్ ఉదయ్, బామండ్ల రవీందర్ మాట్లాడుతూ గుండ్లపల్లి నుంచి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను ప్రశ్నించారు. గుంతల మాయమైన రహదారితో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని అన్నారు. గుండ్లపల్లి నుంచి గునుకుల కొండాపూర్ వరకు గల మట్టి రహదారికి మూడు రోజుల్లో మరమ్మతులు చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్, తిప్పర్తి పరిపూర్ణ చారి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మాతంగి అనిల్, గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి,నాయకులు మాచర్ల శంకర్, మైసంపల్లి తిరుపతి, వంశీకృష్ణ రెడ్డి,బుర్ర మలయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :