కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై మండల అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. మండలంలోని చొక్కారావు పల్లె గ్రామానికి చెందిన ముస్కు ఉపేందర్ రెడ్డి ని మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నియామక పత్రాన్ని మండల అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.