కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: అభివృద్ధిపై ప్రశ్నిస్తే బిఆర్ఎస్ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, యూత్ నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గన్నేరువరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కి సంబంధించి సంవత్సరం సిసి పుటేజులు బయటపెట్టాలని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సవాల్ చేస్తే ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు అన్నారు. ఈ పుట్టేజిలను పట్టుకొని రండి కవ్వంపల్లి అనురాధ ఏమన్నా పొరపాటుగా మాట్లాడితే క్షమాపలు చెప్పడానికి సిద్ధమని అన్నారు. అనురాధను పాకీజా అంటూ పోల్చడం పట్ల తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి పై పదే పదే మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ కార్యాలయం లు ఎందుకు నిర్మించడం లేదని అన్నారు. విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నాలుగు నెలల క్రితం డబుల్ రోడ్డుకు నిధులు వచ్చేయని సంబరాలు చేసుకున్నారు కానీ ఎందుకు పనులు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులను బ్రోకర్లు అంటూ సంబోధించడాన్ని ఖండిస్తూ, ఎవరు బ్రోకర్లో, ఎవరి దోపిడీ చేస్తున్నారు త్వరలో బయటపెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గం బ్లాక్ అధ్యక్షుడు కొమ్మేర రవీందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు కొలుపుల రవీందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, నాయకులు దేశరాజు అనిల్, వెదిరే విజేందర్, కయ్యం సంపత్, యువకులు పాల్గొన్నారు.