కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నీ అరుపులకు బెదిరే వాళ్ళం కాదని అన్నిటిని ఎదుర్కొని నీకు తగిన గుణపాఠం చెప్తామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కవ్వంపల్లి అనురాధలు హెచ్చరించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే మాజీ అయ్యే నీకు అంత తొందరెందుకు ఆన్నారు. 9 ఏళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. నీ ఫామ్ హౌస్ లో జరుగుతున్న బాగోతాలను బయటపెట్టే దమ్ము లేదని హేదేవా చేశారు. అభివృద్ధిని ప్రశ్నిస్తే కేసులతో ఇబ్బందుల గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యేగా చేసిన ప్రతి అక్రమాలను అవినీతిని సాక్షదారులతో సహా బయటపెడతామని హెచ్చరించారు. ఎలక్షన్ అఫిడబిట్లు ఎరుపుల బాలకిషన్ అని శిలాఫలకాలపై రసమయి బాలకిషన్ అని ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో త్వరలోనే నీకు రాజకీయ సమాధి తప్పదు అన్నారు. ఇటీవల సభలో పొరపాటున మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ నాయకులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కారి అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు కొలుపుల రవీందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మార్గం మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.