కరీంనగర్ జిల్లా:మానకొండూర్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చేతిని వదిలిన కీలక కాంగ్రెస్ నేత, యువజన నాయకుడు కారెక్కడం సంచలనంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మానకొండూరులోని గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాడూరి వంశీకృష్ణ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్.. నేడు తీవ్రరూపం దాల్చిందని అంటున్నారు. ఏకంగా యూత్ లీడర్ పార్టీ మారడంతో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరు సురేష్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నేతృత్వంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మాడుగుల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్‌లోకి వంశీ కృష్ణ వెళ్లడంతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ బలోపేతం చేయడం అటుంచితే ఏకంగా పార్టీని నాయకులు వీడడంపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే రసమయితో అనవసర కయ్యాలకు కాలుదువ్వకుండా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీనియర్ మంత్రులు హితవు పలికినట్టు తెలుస్తుంది.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ యువ నాయకుడు గూడూరి సురేశ్ కీలకంగా మారారు. వంశీకృష్ణ పార్టీలోకి రావడం వెనక ముఖ్యపాత్ర పోషించింది ఆయనే అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు ఇది ఇబ్బందికర పరిణామమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చేరికలు వంశీకృష్ణతోనే ఆగిపోతాయా.. మరికొంతమంది చేరే అవకాశం ఉందా అన్నది చర్చకు దారితీసింది. యువజన నాయకులు, సీనియర్ నాయకులు కూడా ఈ బాటలోనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మానకొండూర్‌లో అధికార కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ నేతలు జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నారన్న టాక్ ఉంది. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, పార్టీ పరంగా ఎలాంటి హామీలు లేకపోవడంతో తలోదారి వెతుక్కుంటున్నారని