కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను మండల కేంద్రం గన్నేరువరంలో నేడు నిర్వహించి తీరుతామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు, ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సభకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. మండలం కేంద్రంలోని వివేకానంద విగ్రహం ముందు సభ జరుగుతుంది అందులో ఎటువంటి మార్పు లేదన్నారు. పోలీసుల ఒత్తిడిలకు బెదిరింపులకు భయపడేది లేదు అని ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహిస్తామని తెలిపారు.
శాంతియుతంగా సభ పెట్టుకుంటే కొంతమంది అధికారులు రెచ్చగొట్టే విధంగా వ్యవహారిస్తూ అధికారు పార్టీ తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అధికార పార్టీ సభలకు అనుమతి ఇచ్చిన పోలీసులు, కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. శాంతియుతంగా సభ నిర్వహిస్తాం చట్టప్రకారం నడుచుకుంటాం మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డ భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి యువత తెలుపుతున్న మద్దతూ చూసి తట్టుకోలేక కుట్రలు పన్నుతు ఎమ్మెల్యే ఒత్తిడిలకు తలోగ్గి సభకు పర్మిషన్ లేదని పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, మానకొండూరు నియోజవర్గ బ్లాక్ అధ్యక్షుడు కొమ్మేర రవీందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు కొలుపుల మహేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, నాయకులు మార్గం మల్లేశం దేశరాజు అనిల్,తదితరులు పాల్గొన్నారు.
