- పోలీస్ బందోబస్తుతో అవిశ్వాస తీర్మానం
- అవిశ్వాసం నెగ్గీన అసమ్మతి కార్పొరేటర్లు
- మున్సిపాలిటీలను కాంగ్రెస్ హస్త గతం చేస్తాం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- త్వరలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్న కార్పొరేటర్లు
- రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు తెలుపుతా ఆర్డీవో
- అసమ్మతి కార్పొరేటర్లపై మండిపడ్డ మేయర్ మేకల కావ్య
మేడ్చల్ /జవహర్ నగర్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు గత కొద్దిరోజులుగా అవిశ్వాస తీర్మానం జరగాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు జనవరి 20న వినతి పత్రం అందజేసి అసమ్మతి కార్పోరేటర్లు క్యాంపులు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు పోలీస్ భారీ బందోబస్తు మధ్య అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో అసమతి కార్పొరేటర్లు అవిశ్వాసంలో విజయం సాధించడానికి వ్యూయం పన్నినా మాజీ శాసనసభ సభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో మేడ్చల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానం చేపట్టి హస్తగతం చేస్తామన్నారు అసమ్మతి కార్పోరేటర్లు త్వరలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరబోతున్నారు. మేడ్చల్ జిల్లా ఆర్డీవో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 11.30 నిమిషాలకు అవిశ్వాస తీర్మానం చేపట్టామని అవిశ్వాస తీర్మానంలో జరిగిన పూర్తి సమాచారాన్ని కలెక్టర్ కు తెలియజేసి తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడం ఎంతవరకు న్యాయమని, భూ కబ్జాలు చేసుకోవడమే వారికి ముఖ్యమైన పని అని ఎద్దేవా చేశారు. డిప్యూటీ మేయర్ పై 18 కేసులు ఉన్నా పోలీసులు పీడీ యాక్ట్ ఎందుకు నమోదు చేయరని, ముగ్గురు కార్పొరేటర్లు షోకాజ్ నోటీసులు అందుకున్న కార్పొరేటర్లు లలిత యాదవ్, శాంతి కోటేష్ గౌడ్, బల్లిరోజా లపై ఎందుకు కలెక్టర్ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కార్పొరేటర్ కాక ముందుకు గుడిసెల్లో ఉంటూ, బైక్ లపై తిరిగే వీళ్ళు బహుళ అంతస్తులు కట్టుకొని కోట్లకు ఎలా పరిగెత్తారని అన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం అక్రమ లేఔట్ లు చేసి అమాయక ప్రజలకు అమ్మడం మీరు అసలు వృత్తి అని వీరి అక్రమాలకు అడ్డుగా ఉన్నానని నాపై అవిశ్వాస తీర్మానం తెరపై తీసుకొచ్చారు. అసమ్మతి కార్పొరేటర్ల అసలు నిజరూపం జవహర్ నగర్ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.