మంచిర్యాల జిల్లా…చెన్నూరు మున్సిపల్ పరిధిలో ఆర్ఎంపీలు ప్రజల రక్తం తాగేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పట్టణానికి కొద్ది దూరంలో ఉందని చిన్న జ్వరం వచ్చిందని ప్రజలు ఆర్ఎంపీలను సంప్రదిస్తే చాలు అధనుగా భావించి వైద్య పరీక్షలు, మందుల పేరుతో నిలువు దోపిడీ చేసేస్తున్నారు. చిన్న సూది మందు కూడా ఇచ్చేందుకు అర్హత లేని ఆర్ఎంపీలు నేడు పట్టణంలో పదుల సంఖ్యలో క్లినిక్ లు ఏర్పాటు చేసి అందులో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా బెడ్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఆర్ఎంపీ లను కట్టడి చేసి ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య సదుపాయాలు సజావుగా సాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.