కర్నూల్ జిల్లా : ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ని తెలియజేసే బోర్డులను ప్రజలకు కనిపించే విధంగా ప్రతి మండల మరియు గ్రామ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ కర్నూలు జిల్లా రెప్రెజంటేటివ్స్ పి.తాయన్న,జె.సిద్దు, బొగ్గుల తిక్కన్న గురువారం కోసిగి మండలం లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు విన్నవించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు పాలితులు కనుక ప్రజలకే ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు.ప్రభుత్వ పాలనలో, పారదర్శకతను, పెంపొందించి అవినీతి పారిపోవాలని అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో గోప్యతను నివారించి ప్రభుత్వ పాలన విధానాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు పౌరులకు రాజ్యాంగం కల్పించిన అధ్బుతమైన అవకాశమే సమాచార హక్కు చట్టమని వారు తెలిపారు. దేశంలో సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్టోబరు 13 నుండి అమల్లోకి వచ్చి నేటికి, 18. సంవత్సరాలు అయిందని కోసిగీ మండలంలో ప్రతి సచివాలయంలోను, ప్రతి రైతు భరోసా కేంద్రంలో సమాచార హక్కు చట్టం బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం,మండలం వ్యవసాయాధికారి కార్యాలయం , వెలుగు కార్యాలయం, మండల విద్యా వనరుల కార్యాలయం,మండల అభివృద్ధి కార్యాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పోలీసు స్టేషన్, తదితర కార్యలయాల్లో బయట అందరికి కనిపించే విధంగా బోర్డులో పౌర సమాచార అధికారి పేరు, హోదా, ఫోన్ నెంబర్, మరియు మొదటి అప్పీలేట్ అధికారి పేరు,హోదా, ఫోన్ నెంబర్ చిరునామా వివరములు తెలుపూ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నుంచి, శివకృష్ణ యాదవ్ ,కౌతాళం నుంచి ఖాదర్ భాషా మరియు దేవరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు.