అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి: ప్రభుత్వ భూములు ఆక్రమణల పై స్పందించవల్సిన అవసరం లేదని దేవరాపల్లి తహశీల్దార్ బహిరంగంగా పత్రిక ప్రకటనులు చేయడం హస్యస్పదంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న పేర్కొన్నారు. బుధవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు. మండల మేజిస్ట్రేట్ హోదాలో తహశీల్దార్ గా పని చేస్తున్న వారు ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైన పట్టించుకో వలసిన అవసరం లెదని, మండలం లో అనేక ఆక్రమణలు జరుతున్నాయని ప్రతిదానికీ స్పందించడం కష్టమని ప్రకటించడం మండలం లో ప్రజలను దిగ్బాబ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వకుండా కాపాడవలసిన వారె ఇటువంటి ప్రకటనలు చేయడం దుర్మార్గామైన చర్య అని తెలిపారు. ఇటువంటి ప్రకటనలు వలన ప్రజల్లో రెవెన్యూ అధికారులు పట్ల పూర్తిగా విశ్వాసం పోతుందని తెలిపారు. వెంటనే ప్రభుత్వ భూములు ఆక్రమణ దార్లుపై చర్యలు చేపాట్టి ప్రజల్లో అనూమానాలను నివ్రుత్తిచేయాలని కోరారు. ఈ క్రింది సర్వే నెంబర్లు పై ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలునాయుడు కు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న వ్రాసిన బహిరంగ లేఖలో ఎ ఓక్కటైన సరిగ్గా లేవని తప్పుడు ఆరోపణలు అని రెవెన్యూ అదకారులు దర్యాప్తు రుజువు అయితే నాపై చర్యలు తీసుకోవచ్చు నని వెంకన్న స్పష్టం చేసారు. తారువ రెవెన్యూ సర్వేనెంబరు 179 లో రెడ్డి వారి చేరువు, మరికొన్ని సర్వే నెంబర్లులో గతంలో ఉన్న తహశీల్దార్ రమేష్ బాబు ప్రభుత్వ భూములగా గుర్తించి బోర్డులు పెట్టారు. చుట్టుప్రక్కల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ భూమిని అడ్డగోలుగా కబ్జా చేసారు. దీనిపై విఆర్వో, సర్వేయరు వెళ్ళిచూసి డిప్యూటీ తహశీల్దార్ కు అక్రమణ జరిగినట్లు తెలియజేసారు. ఈ తగాదాలోను దేవరాపల్లి సర్వే నెంబరు 20లో 38 ఎకరాలు 1997 కోర్టు వివాదం తరువాత ఎట్టకేలకు మార్చి 21/2023 న ఆక్రమణ దారునికి వ్యతిరేకంగా శ్రీగౌరవ హైకోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీనిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకుండా తమరు అడ్డం పడుతున్నారు. అదేవిధంగా మారే పల్లి రెవిన్యూ లో సర్వే నెంబరు 115 లో 23,15 సెంట్లు దేవుని భూమిని మీ తారువ గ్రామానికి చేందిన కొంతమంది అన్యాక్రాంతం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మేసారు. ఇది దేవుని భూమి అని విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టు 1999 లో ఇచ్చిన తీర్పుతో సహా అన్ని రెవెన్యూ రికార్డులోను దేవుని మాన్యాంగా ఉంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేసిన ఇద్దరు దేవదాయశాఖ అస్టెంటు కమీషనర్లును మీ అధికారాన్ని ఉపయోగించి బదిలీ చేయించారు. ఈ భూమిని దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకోకుండా అడ్డం పడుతున్నారు. ఈ భూమి ప్రస్తుతం వివాదంలో ఉంది. దేవరాపల్లి రెవెన్యూకు చెందిన సర్వే నెంబర్ 280/1లో దేవరాపల్లి గ్రామానికి చెందిన క్షేత్రియ దేవిసింగ్ కు పట్టా గతంలో ఇచ్చారు. ఇది అన్యాక్రాంతం అయ్యింది. దీనిపై ఇతను చోడవరం కోర్టులో కేసు వేసారు. చోడవరం కోర్టులో కేసు కోట్టీ వేసింది. ఇతను మరనించినప్పటికి మరనించిన వ్యక్తి పెరున మరల హైకోర్టులో కేసువేసారు. కోర్టు నుండి తీర్పు వచ్చే వరకు భూమిలోకి వెళ్ళరాదు, అయినప్పటికీ ఆ భూల్లో ఫలసాయం వేస్తున్నారు. 281/2 కూడా చోడవరం కోర్టులో కేసు వేసారు. ఇది కూడా కేసు కోట్టి వేయడంతో మరల గౌరవ హైకోర్టు నందు కేసు వేసి ఈ సర్వేనెంబరు281/2 ను 281/2 అని తప్పుడు రికార్డు సృష్టించి ఫలసాయం తీసుకోవాడానికి అనుమతి తెచ్చుకోని ఫలసాయం తీసేసుకోవడం జరిగింది. ఆయన రెవెన్యూ అధికారులు కళ్ళు అప్పగించుకోని చూసారు. మరల ఫలసాయం వేస్తున్నారు. 281/2 అనే సర్వే నెంబర్ ఎరెవెన్యూ రికార్డుల్లోను లేదు. ఆయినప్పటికి తప్పుడు రికార్డులు సృష్టించి, మీ అండదండలతో రెవెన్యూ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ భూములు ఆక్రమించిన వారు అందరూ మీ పార్టీలో ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్నవారు. మరియు వారి భందువులు ఉన్నారు. అడ్డ గోలుగా కోర్టు చుట్టూ రెవెన్యూ అధికారులను తిప్పుతున్నారు. ఆక్రమంగా పంటలు వెస్తూన్నారు. పట్టించు కోవలసిన రెవెన్యూ అధికారులు మీకు, మీ పార్టీకి భయపడి పట్టించుకోకుండా ఆక్రమణ దార్లు పట్ల ఉదారంగా వ్యవహరిస్తూన్నారు. కోర్టు వివాదం ఉన్న భూముల్లో పంటలు వేయడం తప్పుడు రికార్డులు సృష్టించి కోర్టులను ప్రజలను తప్పుదోవ పట్టించడం సరియైనది కాదు. మీ సొంత గ్రామంలో ఆక్రమిత భూములకు తహశీల్దార్ బోర్డులు పెట్టిన ఆ భూములను అడ్డగోలుగా కబ్జాచేసేస్తూన్నారు. విటిని వెంటనే నిలుపుదల చేసి ఆక్రమణ దారునిపై చర్యలు తీసుకోవాలి. దేవరాపల్లి సర్వే నెంబరు 20 కి గల భూములకు సరిహద్దులు, తేల్చి రక్షణ కల్పించాలి. కోర్టు వివాదంలో భూముల్లో పంటలు వేయాడాన్ని వెంటనే నివారించేందుకు అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వని ఎడల ఆక్రమణ దారుకు మీరు, మీ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నట్లు భావించవలసి వస్తుందని ఇంత స్పష్టంగా లేఖలో పేర్కొన్న తహసీల్దార్ మాత్రం స్పందించవలసిన అవసరం లేదని చెప్పడం అదికార దుర్వీనియోగానికి పాల్పుడినట్లు స్పష్టంగా అర్దమవుతుందని వెంకన్న తెలిపారు.
