- నిబంధనలు తుంగలో తొక్కుతూ యథేచ్ఛగా పశువుల రవాణా
అల్లూరి జిల్లా హుకుంపేట : అల్లూరీ జిల్లాలో అక్రమంగా ఆవుల రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. అతిపవిత్రంగా భావించే ఆవులను అక్రమ రవాణాకు గురికావడం మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆవుల అక్రమ రవాణాను అరికట్టాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.. ఇంకా అక్కడక్కడ ఈ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆవుల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇలా కొందరు అక్రమార్కులు ఎలాంటి భయం లేకుండా యధేచ్ఛంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ చోటు చేసుకుంటున్నాయి. ఒరిస్సా రాష్ట్రంలో నుంచి ఆంద్రప్రదేశ్ అల్లూరి జిల్లా హుకుంపేట మీదగా అక్రమంగా రాజమండ్రి సరిహద్దుల్లో కంటైనర్ లోకి మార్చి అక్కడ నుంచి తమిళనాడు , కేరళ రాష్టలకు తరలిస్తున్నారు.కానీ సంబధితాధికారులు మాత్రం పట్టించుకోవడం ప్రధాన రహదారి కళ్ళ ముందే వెళ్తున్న పట్టించుకోవడం లేకపోవడం దారుణము అని బైక్ మీద వెళ్లిన తనిఖీ చేసి పంపిస్తున్నారు కానీ అంత పెద్ద వాహనం మీద జంతువుల వాహనము అని అంగ్లము లో రాసి ఉన్నది కనిపోయించలేదా అని హిందూ మతానికి చెందిన కొందరు హిందువులు విమర్శింస్తున్నారూ
పశు సంపదను పెంచితే రైతులే కాదు దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్న వాదన పై కూడా కేంద్ర చర్యలు కూడా చేపట్టింది. గోవధపై నేరుగా నిషేధం విధించకపోయినా.. క్రయవిక్రయాలపై మాత్రం ఆంక్షలు విధించింది. పశుసంపదను అక్రమంగా ఎగుమతి చేయడం, క్రూరంగా వధించడం నేరమని కూడా పరిగణించింది. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పశువులను విక్రయించకూడదనే నిబంధనలకు కొందరు వ్యాపారులు తూట్లు పొడుస్తున్నారు. అడ్డదారుల్లో వేలాది పశువులను ఆయా జిల్లా సరిహద్దులను దాటిస్తూ యథేచ్ఛగా విక్రయాలు చేపడుతున్నారు. అంతేకాదు.. బహిరంగ మార్కెట్లో ఆవులు, ఎద్దులు, గేదెలను కబేళాలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా నుంచి రాజమండ్రి కి ఎక్కువగా కబేళాలను తరలిస్తున్నారు.
పశురవాణా చట్టం..ఇలా చెపుతుంది.
పశురవాణా చట్టం 1978 ద్వారా పశువులను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే మండల స్థాయి తీర్మానాన్ని చేయాల్సి ఉంటుంది. ఒక వ్యానులో అయితే రెండు, లారీలో అయితే నాలుగు మించి పశువులను ఎక్కించకూడదు. ముఖ్యంగా పశువులను తరలిస్తున్న వాహనంలో గాలి, వెలుతురు వచ్చే సదుపాయం ఉండాలి. పశువులకు నీరు, ఆహారాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రతీ అరగంటకోసారి పశువులను వాహనం దింపి సేద తీరే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఇక గర్భంతో ఉన్న పశువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించకూడదు. నిబంధనలు పాటించకుండా పశువులను రవాణా చేస్తే ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే తాజా పరిస్థితులను చూస్తే అందుకు భిన్నంగా ఉంటున్నాయి. అక్రమార్కులు జిల్లా సరిహద్దులను దాటేస్తూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆవులు, ఎద్దులు, గేదెల అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది.
అయితే పశువుల విక్రయాలపై కేంద్రం నేరుగా నిషేధం విధించకపోయినా.. క్రయ విక్రయాలపై కొత్త నిబంధనలతో అడ్డుకట్ట వేసేందుకు ఆంక్షలు విధించింది. హిందువులు ఆవులను ఎంతో పవిత్రంగా భావిస్తూ పూజలు నిర్వహిస్తుంటారు. గోవధ చేస్తే మహాపాపమని, ఎలాంటి అక్రమ రవాణా చేయకూడదని, ఇలాంటి అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.