కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ నుండి వడ్లూరు వెళ్లే రహదారి ని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆదివారం సందర్శించరు.ఈ సందర్బంగా సీపీఐ మండల కార్యదర్శి కాంతాల అంజి రెడ్డి మాట్లాడుతూ రహదారి వెంట ఐదు ప్రమాదకర భావులు రెండు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నవి . కాంట్రాక్టర్ ఎటువంటి వాలు గోడలు నిర్మించకుండా ఇస్టానుసారంగా రోడ్డు పోసుకొని తన దారి తను చూసుకున్నాడు. ఒక్కొక్క బావి కాడ కంచె లు లేక చీరలు చుట్టిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని భవిష్యత్తు లో ఏదైనా ప్రాణ హాని జరిగితే ఎవరిది బాధ్యత కాంట్రాక్టరద లేక ప్రభుత్వం ద అని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫర్మర్ వద్ద గతంలో ఆవు చనిపోయింది. నాలుగు రోజుల క్రితం మేకపోతు చనిపోయింది. ఇదేమిటని స్థానిక లైన్మెన్ ని సంప్రదిస్తే అతను నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నాడు . మీరు రోడ్డు పోసినప్పడు ఏమి చేసారు. అని నాకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లు గా ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ మూగజీవాలకే దిక్కులేదు రేపు మనిషి ప్రాణం పోతే ఎలా అని ఈ ఐదు ప్రమాదకరభావులను వెంటనే వాల్ గోడ నిర్మించాలని మరియు ట్రాన్స్ఫర్మ్ రు ను తొలగించలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు . లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శిలు చోక్కల శ్రీశైలం,మొలుగురి సంపత్ యువజన నాయకులు ఆంజనేయులు,గర్షకుర్తి శ్రీనివాస్.బచ్చంటి శ్రీనివాస్ చోక్కల తిరుపతి. బట్టు మునిరాజ్,సంబు అంజి తదితరులు పాల్గొన్నారు.