కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం తప్పదని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ పొనగంటి కేదారి రాష్ట్ర ప్రభుత్వనికి హెచ్చరించారు. ఈరోజు గన్నేరువరం మండల కేంద్రంలో కౌన్సిల్ సమావేశం మండల సహాయ కార్యదర్శి చుక్కల్ల శ్రీశైలం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పొన్నగంటి కేదారి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు గడుస్తున్నాయని ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి,పెన్షన్ రైతుల రుణ మాఫీ, రైతులకు బోనస్, ఎలాంటి షరతులు పెట్టకుండా అందించాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా సిపిఐ పోరాటం చేస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాటాలను ఉద్యమాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోనగిరి మహేందర్,నాయకులు శ్రీనివాస్, మోలుగురి ఆంజనేయులు, సాగర్ రెడ్డి, బోయిని మల్లయ్య, కూన మల్లయ్య, పంబాల ఆంజనేయులు, సామ వెంకటరెడ్డి, జాలి గోపయ్య, పిప్పల కనుకయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.