నెల్లూరు జిల్లా: భూమికోసం, భుక్తి కోసం శ్రామిక విముక్తి కోసం పెరగని పోరాటాలు చేస్తూ నిరంతరం పేదల పక్షాన నిలిచి వంద వ సంవత్సరంలో అడుగుడిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బద్వేల్ ఏరియా కార్యాలయం నందు జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. 1925 డిసెంబర్ 26వ తారీఖున కాన్పూర్ నగరంలో పురుడు పోసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర అ ఎన్నో మహోజ్జోల చరిత్ర ఘట్టాలతో ముందుకు పోతున్న తరుణంలో అనేక కుట్ర కేసులు బనాయించి ఈ దేశంలో ఎర్రజెండా లేకుండా చేయాలనుకున్న ప్రతి ఒక్కరి ఆశలు అడియాశలు చేసి ఎర్ర సూర్యుని వలె ఎర్రజెండా నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం నిలిచిందని తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాదిమంది కమ్యూనిస్టులను పోగొట్టుకున్నప్పటికీ లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను జమీందారీ జాగిర్ధరిభూములను పంచిన ఘనత సిపిఐ గాని ఈ దేశంలో రాజభరణాల రద్దు బ్యాంకుల జాతీయ కరణ చేయాలని కొవ్వెత్తున ఉద్యమాలు నడిపిన సిపిఐ 100 సంవత్సరాలలో ఎన్నో విజయాలు సాధించి మూడు రాష్ట్రాలలో అధికారం కూడా చేపట్టి సోషలిజం లక్ష్యంగా సమసమాజ స్థాపన కోసం ఉద్యమిస్తున్నదని రాబోవు రోజుల్లో పాలక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు, ఏరియా కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ, విజయమ్మ, నాగేష్ ,శాఖా కార్యదర్శులు నాగసుబ్బయ్య ,రమణయ్య వ్యవసాయ కార్మిక సంఘం ఏరియా అధ్యక్షులు పొంగూరు నాగరాజు పట్టణ నాయకులు సుబ్బారెడ్డి ,వెంకటేష్ రవీంద్ర నవనీతమ్మ, రామ సుబ్బారెడ్డి,నరసయ్య, భాష బొడ్డు చిన్న, ఓబులేసు రవణ తదితరులు పాల్గొన్నారు.