కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు సందర్శించారు .ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వివిధ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు లేక రైతులు వడ్లను దళారులకు అమ్ముకుంటున్నారు. వడ్ల కేంద్రాలు ప్రభుత్వ అధికారులు సత్వరమే ప్రారంభించి రైతులు నష్టపోకుండా చూడాలని నాయకులు అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సిపిఐ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతాల అంజి రెడ్డి,సహాయ కార్యదర్శి చొక్కాల శ్రీశైలం,నాయకులు బోయిన మల్లయ్య,కూన మల్లయ్య, పబ్బతి సాగర్ రెడ్డి, యువజన నాయకులు మొలుగూరి ఆంజనేయులు, చింతల మునందర్ రెడ్డి, తాటికొండ కానుకయ్య, ముచ్చ నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.