కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు మాట్లాడుతూ వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్లు శిథిలావస్థకు గురికావడం జరిగింది. కొన్ని గ్రామాల్లో పూర్తిగా మూసివేశారు. దీనితో ప్రజలు ప్రైవేటు వాటర్ ప్లాంట్లు కు వెళ్లి త్రాగునీరు తీసుకొచ్చుకుంటున్నారు అని అన్నారు. కొన్ని గ్రామాలలో ప్రక్కన ఉన్న గ్రామాలకు వెళ్లి నీరు తీసుకువస్తున్నారు అని ఆవేదనవ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ప్లాంట్లను ఏర్పాటు చేయడం వల్ల గ్రామపంచాయతీకి రావాల్సిన వాటర్ ప్లాంట్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అని అన్నారు. గ్రామాల్లో మూసివేసిన వాటర్ ప్లాంట్లపై సర్వే చేసి శిధిలావస్థలో ఉన్న వాటిని గుర్తించి వాటిని బాగు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొన్ని గ్రామాల్లోవాటర్ ప్లాంట్ లో నిధులు దుర్వినియోగం చేసిన వారిపైన చట్టపైనమైన కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసినారు. వాటర్ ప్లాంట్ నిధులు దుర్వినియోగంచేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోకపోతే సిపిఐ మండల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఇట్టి కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి. సహాయ కార్యదర్శులు చొక్కాల్ల శ్రీశైలం మొలుగురి సంపత్.కోశాధికారి ఘర్షకుర్తి శ్రీనివాస్.కూన మల్లయ్య. సాగర్ రెడ్డి. సిహెచ్. కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
