- లెళ్లేలా బాలకృష్ణ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాబురావుపేట శివారులో సర్వేనెంబర్ 8లో పేదలు ఇళ్ల స్థలాల కోసం 23 రోజులుగా పోరాటం చేస్తున్న ప్రజలకు మద్దతుగా లెళ్లేలా బాలకృష్ణ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరై మాట్లాడుతూ అట్టడుగు వర్గాల పేద ప్రజలు మహిళలు, వృద్ధులు, చంటి పిల్ల తల్లులు వేడినీ తట్టుకోలేని ఎండలో ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడం లేదు.అసైన్మెంట్ చట్టం ప్రకారం సంవత్సరం పాటు ఎవరు సాగులో లేకపోతే తిరిగి పేద ప్రజలకు పంచాలని ఉంది ఆ చట్టాన్ని త్రుంగలో తొక్కుతూ భూ కబ్జాదారులు,కౌన్సిలర్లు ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై అంతర్యం ఏమిటో తెలియపరచాలని, అసైన్మెంట్ భూములపై పూర్తి దర్యాప్తు చేసి కబ్జాదారుల కోరల్లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని,పేదలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంకె రవి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, దాసరి రాజేశ్వరి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు, బోడెoకి చందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఆవెస్ పట్టణ కార్యదర్శి, కావిరి రవి మారన్న కరీమా, సమ్మక్క, పోసక్క సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు, ఇళ్ల స్థల పోరాట కమిటీ సభ్యులు మనక్క, రేణుక, పోసక్క,రాజేశ్వరి, మధు నక్క, ఉమారాణి, ప్రసన్న, వైశాలి, లత, పవనసుధ, శైలజ, రాజేశ్వరి, గుడిగజంగాల కళాకారులు తదితరులు పాల్గొన్నారు.