కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: 23 సంవత్సరాల నుండి సిపిఐ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన మొలుగూరి సంపత్,ఈరోజు సిపిఐ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మానకొండూరు శాసనసభ్యులు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా మొలుగురి సంపత్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సామాన్య ప్రజానీకానికి సైతం అందుతున్నాయని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి కుటుంబానికి లబ్ధి జరుగుతుందని అంతేకాకుండా బిఆర్ఎస్ మేనిఫెస్టో పేద నిరుపేద కుటుంబాలకు సైతం న్యాయం చేసే విధంగా ఉందని అందుకే టిఆర్ఎస్ లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మేనిఫెస్టోను ప్రజలు ఎవరు విశ్వసించడం లేదని ఆయన అన్నారు. గన్నేరువరం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప వెంకన్న, గునుకుల కొండాపూర్ ఎంపీటీసీ గుడెల్లి ఆంజనేయులు,ఖాసీంపేట ఎంపిటిసి ఏలేటి స్వప్న చంద్రారెడ్డి ల సమక్షంలో సీపీఐ నాయకులు ములుగురి సంపత్, గునుకుల కొండాపూర్ గౌడ సంఘం నాయకులు గుండరాజు, వీరు పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అందే సంపత్ తదితరులు పాల్గొన్నారు.
