ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఐ(ఎం) (CPI(M)) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
సీతారాం ఏచూరి ఒక ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఆయన 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ పార్టీకి విశేష సేవలందించారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభలో సభ్యుడిగా ఉండి ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించారు. సీతారాం ఏచూరి ఆలోచనాపరుడిగా, వామపక్ష సిద్ధాంతాలకు పునాదిగా నిలిచారు. ఆయన మరణం సీపీఎం పార్టీకి, అలాగే వామపక్ష ఉద్యమానికి తీరని లోటు. ప్రముఖ రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు ఆయన మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
