- రాష్ట్ర పోలీస్ రోడ్ సేఫ్టీ, జీవికె EMRI ల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ల వారీగా సిపిఆర్ శిక్షణ
సిపిఆర్ విధానాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని గౌరవ డిజిపి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి,ఐపిఎస్.,(డిజిపి) ఉత్తర్వుల ప్రకారం రామగుండం పోలీస్ కమీషనరెట్ వ్యాప్తంగా రాష్ట్ర రోడ్ సేఫ్టీ ఆర్.ఐ. వై.వి.ప్రతాప్, EMRI ప్రతినిధి సుమన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ల వారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దాని లో భాగంగా ఈరోజు బుదవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు.
ఈ శిక్షణ లో సిపిఆర్ (కార్డియో ఫుల్మనరీ రిససిటేషన్) పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలు, ప్రమాద ఘటనలతో ప్రాణాలు కాపాడడంలో సిపిఆర్ ప్రక్రియ చాలా కీలకంగా పని చేస్తుందని, ఈ విధానంపై పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని, అనుకోని సంఘటనలు, ప్రమాదాలు జరిగిన సమయంలో మనిషి గుండె స్తంభించినప్పుడు, ఊపిరితిత్తులలో శ్వాస తీసుకోవడం సమస్యగా మారినప్పుడు వారి ప్రాణాలు కాపాడడం కోసం హృదయ, శ్వాసకోశ పునరుజ్జివ చర్య చాలా కీలకంగా పని చేసి స్తంభించిన గుండె తిరిగి పని చేసే విధంగా సిపిఆర్ ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే సిపిఆర్ ప్రక్రియ ఏ రకంగా చేయాలనే విషయంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర రోడ్ సెఫ్రీ, జీవికె EMRI ల సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రదానంగా కరెంట్ షాక్ తగిలినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో, అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన సమయంలో, శ్వాస సమస్యలు వచ్చి గుండె ఆగిపోయిన సందర్భాలలో సిపిఆర్ ప్రక్రియ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఇలాంటి సమయాలలో ఛాతీ మీద పలుమార్లు బలంగా నొక్కడం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. పోలీస్ సిబ్బంది అందరికి సిపిఆర్ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో,ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ పెద్దపల్లి SI రాజేష్ రాష్ట్ర రోడ్ సేఫ్టీ ఆర్.ఐ. వై.వి.ప్రతాప్, EMRI సిబ్బంది, 30 మంది డ్రైవర్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.