- 337 లీటర్లు నాటుసారా పట్టివేత.
- 16మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు.
అల్లూరి జిల్లా, హుకుంపేట :నాటు సారా రవాణా చట్టరీత్య నేరమని స్థానిక ఎస్సై బి సతీష్ అన్నారు. మండల కేంద్రం పరిధిలో వివిధ గ్రామాల్లో గతంలో 16 మంది నాటు సారా కేసులో పట్టుబడిన ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి
337 లీటర్లు నాటు సారా సీజ్ చేశామని ఎస్సై బి సతీష్తెలిపారు.జిల్లా ఏ ఎస్ పి,ఎస్పీ ఆదేశం మేరకు సి ఏ ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు. నాటుసారని గుంతలు తవ్వి పారబోశారు. అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ నాటు సారా క్రయ విక్రయాలు చేయడం చట్టరీత్య నేరమని వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని ఆయన అన్నారు. యువతీ యువకులు చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.