కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కాంతాల కిషన్ రెడ్డి, కాంతాల నాగమణి కొండల్ రెడ్డికి చెందిన ట్రాక్టర్ల పై చెట్టు విరిగిపడడంతో నష్టం వాటిల్లింది. గురువారం వీచిన తీవ్రమైన గాలులకు చెట్టు విరిగిపడడంతో రెండు ట్రాక్టర్ల ఇంజన్లు ధ్వంసం అయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మాదాపూర్, గన్నేరువరం గ్రామంలో మొక్కజొన్న, మామిడి తోటల పంటలకు అపార నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మానకొండూరు నియోజవర్గ కాంగ్రెస్ బ్లాక్ అద్యక్షుడు కొమ్మేర రవీందర్ రెడ్డి తెలిపారు.
