పాడేరు:- సిఆర్పిఎఫ్ సిబ్బంది తీవ్రవాద నియంత్రణతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముందుకు రావటం అభినందనీయమని జిల్లా కలక్టర్, రెడ్ క్రాస్ చైర్మన్ సుమిత్ కుమార్ సిఆర్పిఎఫ్ సిబ్బందిని అభినందించారు. శుక్రవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిభిరాన్ని జిల్లా కలక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా సిఆర్పిఎఫ్ సిబ్బంది, అధికారులు రద్దీ నియంత్రణ, అల్లర్ల నియంత్రణ, తీవ్రవాద కార్యకలాపాలు నియంత్రణ, సమస్యాత్మక ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ, తదితర విధులతో తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముందుకు వచ్చి రక్తం దానం చేయటం సంతోషకరమన్నారు. 198 వ బెటాలియన్ కు సంభందించి సిఆర్పిఎఫ్ కమాండెంట్ రాజేష్ పాండే సూచనల మేరకు రూడకోట, నుర్మతి జి.మాడుగుల మరియు పెదబయలు ఔట్ పోస్టుల నుండి 25 మంది, 234 వ బెటాలియన్ కు సంబంధించి కమాండెంట్ సంజీవ్ ద్వివేది సూచనలు మేరకు పాడేరు ఔట్ పోస్ట్ కు చెందినా ఆరుగురు సిఆర్పిఎఫ్ సిబ్బంది ఈ శిభిరంలో పాల్గొని రక్తదానం చేసారు. వీరితో పాటు పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సుధాకర్ 26వ సారి రక్తం దానం చేయటానికి ముందుకు రావటం విశేషం. ఈయన ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్త దాన శిభిరాలలో పాల్గొని రక్తం దానం చేయటం అలవాటుగా మార్చుకున్నారు.
వీల్ చైర్ల పంపిణీ
రెడ్ క్రాస్ ఆఅద్వర్యoలో నిర్వహిస్తున్న రక్త దాన శిభిరంలో భాగంగా విభిన్న ప్రతిభావంతులైన నలుగురు వికలాంగ లబ్దిదారులకు వీల్ చైర్లను కలక్టర్, రెడ్ క్రాస్ చైర్మన్ బహూకరించారు. రెడ్ క్రాస్ సంస్థ అందించిన ఆరు వీల్ చైర్లలో ఇప్పటికే ఇద్దరు లబ్దిదారులను గుర్తించి గత వారం పంపిణీ చేయటం జరిగింది. మిగిలిన నలుగురు లబ్దిదారులను గుర్తించి శుక్రవారం పంపిణీ చేసారు. పేద బడుగు వర్గాల ప్రజలకు సేవలు అందించటానికి రెడ్ క్రాస్ ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా కలక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్ఓ పి. అంబేద్కర్, పరిపాలనాధికారి చిన్ని కృష్ణ, సిఆర్పిఎఫ్ 198 వ బెటాలియన్ డిప్యూటి కమాండెంట్ భగత్ సింగ్, అసిస్టంట్ కమాండెంట్ బి. ఉదయ్ కుమార్, 234 వ బెటాలియన్ అసిస్టంట్ కమాండెంట్ ఎ. మురగావేలు, పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సుధాకర్, జి.మాడుగుల ఎస్ ఐ ఎ. శ్రీనివాస రావు, రెడ్ క్రాస్ సభ్యులు సూర్య రావు, జయలక్ష్మి, లోహితాస్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.