అల్లూరి సీతారామరాజు జిల్లా ఏఓబి, చింతపల్లి : జులై 28 నుండి ఆగస్ట్ 3 జరగనున్న మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో చింతపల్లి ఏ ఎస్ పి. శివ కిషోర్ ఆదేశాల మేరకు సీఐ.అశోక్ కుమార్,ఎస్ ఐ అరుణ్ కిరణ్. పోలీసు సిబంది యొక్క ఆధ్వర్యంలో పగలు రాత్రులు వాహనాలు తనిఖీ చేస్తూ మావోయిస్టుల కొరియర్లను మరియు ఇన్ఫార్మర్లను గుర్తించేందుకు గాను పలు చర్యలు చేపట్టి, మావోయిస్టు వారోత్సవాల సమయంలో. ఎవరైనా అనుమానస్పదంగా తిరిగితే పోలీసు వారికి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
