మదనపల్లి : వెబ్ సిరీస్ గమనిక సినిమా టైలర్ ని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష లాంచ్ చేశారు. ఆదివారం తన నివాసంలో వెబ్ సిరీస్ సినిమా టైలర్ ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. మదనపల్లికి చెందిన యువ కథానాయకులు సొంతంగా నిర్మించుకున్న చిత్రం ప్రజలను ఆకర్షిస్తుందని ఆకాంక్షించారు. సమాజానికి ఉపయోగపడే మరిన్ని చిత్రాలు నిర్మించాలని చిత్ర బృందాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మణికృష్ణ, హీరో అవినాష్, హీరోయిన్ నిహారిక, మురళి, సిబ్బంది పాల్గొన్నారు..