మదనపల్లి : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను ఆదివారం హనీ ఫ్రెండ్స్ గ్రూప్ సందర్శించింది. ఈ సందర్బంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఎంపీ ఆనందన్ హనీ ఫ్రెండ్స్ గ్రూప్ కు చెందిన బి సుభద్రమ్మ, గ్రామ జ్యోతి సొసైటీ ఫౌండర్, ఏ.కృపావరమా రిటైర్డ్ సిహెచ్ఓ,టి ఈశ్వరమ్మ రిటైర్డ్ సిహెచ్ఓ, వి.పార్వతమ్మ రిటైర్డ్ CHO , పి మంగమ్మ సూపరిండెంట్ ఐసిడిఎస్, బి ఆర్ వనమాల పబ్లిక్ హెల్త్ నర్స్, ఎన్ పద్మ స్కూల్ అసిస్టెంట్ , పి. మని, మరియు ఉష నర్సు సాదరంగా పుష్పగుచ్చములతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గ్రామ జ్యోతి సొసైటీ ఫౌండర్ బి సుభద్రమ్మ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో చేస్తున్నటువంటి సేవలు గురించి కొనియాడారు. పిల్లలకి వ్యక్తిగత శుభ్రత,ఏకాగ్రత పిల్లలతో ధ్యానము మరియు ప్రాణాయామం చేపించి వారి ఆరోగ్యాన్ని మరియు ఏకాగ్రతను ఎలా మెరుగుపరుచుకోవాలని వారు తెలియజేశారు.అనంతరం 15వేల రూపాయలు విలువ చేసే పది ట్రంకు బాక్సులు మరియు విద్యాస్రామాగ్రిని పిల్లలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య సూచన సేవా సంస్థ నిర్వాహక అధ్యక్షులు సి.ఎం.పి ఆనందం గారు మరియు ప్రధానోపాధ్యాయురాలు గిరిజమాల్ గార్లు ప్రశంసా పత్రాలతో వారిని సత్కరించడం జరిగింది జనరల్ సెక్రెటరీ కవిత కవిత రాణి గారు వారికి షిల్డులు లుతో పాటు దుస్సాలువతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బోధనేతర మరియు బోధన సిబ్బంది… విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు