చిత్తూరు జిల్లా, పలమనేరు: ఆర్ డి ఓ కార్యాలయంలో పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పది మండలాల ప్రజలు పలు రకాల ఫిర్యాదులు చేయడానికి అధికారుల వద్దకు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలమనేరు శాసన సభ్యులు అమర నాథ్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఎస్పీ మణికంఠ చందోలు, డి ఆర్ ఓ, మోహన్ కుమార్. జెడ్పీసీఈఓ రవి కుమార్ నాయుడు, పి ఆర్ ఎస్ఈ చంద్ర శేఖర్ రెడ్డి,డ్వామా పిడి రవికుమార్,డి పి ఓ సుధాకర్ రావు,డి ఆర్ డి ఏ పిడి శ్రీదేవి,ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ నరేంద్ర కుమార్, రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు,ఎం పి డి ఓ లు, ఇతర డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
