గుర్తు తెలియని వ్యక్తుల పేటీఎం నుంచి ఓ మహిళ పేటీఎంకు డబ్బులు వచ్చాయి. మిస్ అయి వచ్చాయనుకొని ఆ డబ్బులను అదే నెంబర్ కు తిరిగి పంపించాారు. అదే ఆమె పాలిట శాపంగా మారింది.
ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇప్పటి వరకు లోన్ యాప్ లను సంప్రదించి అప్పు తీసుకున్న వారినే వేధించిన సంఘటనలు చూశాం. కానీ తూర్పు గోదావరి జిల్లా కడియంలో సరికొత్త లోన్ యాప్ వేధింపుల ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… కడియం మండలంలో నివాసం ఉండే దేవి అనే మహిళ నిన్న దిశా ఎస్ఓఎస్ కు కాల్ చేసి తనను లోన్ యాప్ నిర్వాహకుడు వేధిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన దిశ పోలీసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజుల కిందట గుర్తు తెలియని నెంబర్ నుండి తనకు 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయని.. అది గమనించి వెంటనే అదే నెంబర్ కు అమౌంట్ తిరిగి పంపించినట్లు తెలిపారు.
అప్పటి నుండి అదే నెంబర్ నుండి వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయారు. అదనంగా డబ్బులు