మెదక్ జిల్లా / తూప్రాన్ : ఓ వైపు సైబర్ నేరాల గురించి ప్రతి రోజు అవగాహన కల్పించి చైతన్య పరుస్తుంటే మరోవైపు కొత్త ప్రయోగం చేసి సైబర్ నేరగాళ్లు పెట్రెగిపోతున్నారు.ఒక విద్యా వంతున్ని బురిడీ కొట్టించి మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి అన్ లైన్ లో షర్స్ కొనుగోలు చేయడానికి గూగుల్ లో సెర్చ్ చేస్తే అతనికి వాట్స్ ఆఫ్ కు మేసేజ్ వచ్చింది. మీరు పెట్టుబడి పెట్టండి డబుల్ ధమాకా డబ్బులు మేము ఇస్తామని వచ్చింది. కాగా అన్ని విషయాలు వివరంగా తెల్సుకున్న సదరు వ్యక్తి సమారు 10 లక్షల 94 వేల 589 రూపాయలు తన బ్యాంక్ అకౌంట్ నుండి బదిలీ చేసి షేర్ లు కొనుగోలు చేశారు. కాగా సదరు వ్యక్తి నా అవసరం నిమిత్తం డబ్బులు తీసుకుంటానని తెలుపగా ఇంకా మరో 3,89,589 రూపాయలు చెల్లిస్తే మొత్తం డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పడం తో ఆ డబ్బులు కూడా అకౌంట్ ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత మోసపోయానని తెల్సుకుని తూప్రాన్ పోలీసులను ఆశ్రయించారు . అతని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తూప్రాన్ ఎస్ ఐ శివానందం తెలిపారు. కాగా భాడితుడి పేరు వివరాలు గోప్యంగా ఉంచారు.