తెలంగాణలో ఆంధ్రా పెత్తందారుల సినీ, టీవీ (DAAT ) అసోసియేషన్ల ఆగడాలకు అడ్డు అదుపులేకుండ పోయింది. పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఆటలు సాగుతున్నాయి కాదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కళాకారుల సొమ్మును అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గత ప్రభుత్వం పాలన నుండి నేడు అనగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వచ్చినా కూడా .. దశాబ్ది ఉత్సవాలు అంటూ .. కళాకారులను మోసం చేస్తున్నారు. 2023 నుండి డాట్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేటికీ కూడా దశాబ్ది ఉంత్సవాలు జరుపుతూనే ఉంది. అంటే ఎవర్ని సంతృప్తి పరచడానికి ఈ దశాబ్ది ఉంత్సవాలు? ఎవర్ని మోసం చేయడానికి ? 2023 నుండి 2024 వరకు దశాబ్ది ఉత్సవాలు ఏందీ ? అసలు వీరికి అంత డబ్బు ఎక్కడిది ? దశాబ్ది ఉత్సవాల పేరుతో ఎవర్ని మోసం చేస్తున్నారు ?
సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ అయిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అఫ్ తెలుగు టెలివిజన్ ( DAAT ), స్వచ్చందంగ సేవా కార్యక్రమాలు చేయాలి. అనగా మెడికల్ క్యాంపులు , అవగాహన సదస్సులు పెట్టుకోవాలి కానీ ఆలా కాకుండా డాట్ అనేది ఒక యూనియన్ అని , కార్మిక సంఘమని, కార్మికులకు సేవ చేయడానికే పుట్టిందని తప్పుడు సమాచారాన్ని అమాయక యువత పై రుద్ది మోసాలకు పాలు పడుతున్నారు. తెలంగాణలో తెలంగాణ టీవీ , మూవీ సంబందించిన యూనియన్లు ఉన్న తరువాత అసలు వీరెవరూ ? స్వచ్చంద సంస్థకి కార్మిక హక్కులు ఎవరిచ్చారు. తెలంగాణ యూనియన్లు ఉచితంగా గుర్తింపు కార్డు ఇచ్చి యువతను ప్రోత్సహిస్తుంటే మధ్యలో ఈ అసోసియేషన్లు ఏందీ ? వెంటనే ప్రభుత్వం స్పందించి టివి, సినీ అస్సోసియేషన్లను రద్దు చేయాలని తెలంగాణ కళాకారులు కోరుతున్నారు.