హైదరాబాద్ / శ్రీనగర్ కాలనీ : డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (డాట్ ) తెలంగాణ డబ్బింగ్ యూనియన్ సభ్యుల వేతనాలను అక్రమంగా వసూల్ చేసుకొని దందాలకు పాలుపడుతుందని ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. అంతేకాక డబ్బింగ్ స్టూడియోలకు వెళ్ళి కార్మికుల వేతనాలు డాట్ బ్యాంక్ ఖాతాలో వేయాలని డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాలుపడడం పరిపాటైంది. ఒక్క డబ్బింగ్ కళాకారుడి కి రావాల్సిన వేతనం ఒక లక్ష రూపాయలు ఇవ్వకుండ బెదిరింపులకు పాలుపడినప్పుడు మరి మిగతావారి పరిస్థితి ఏంటి ? ఈ విధంగా ఎంతమంది కళాకారుల వేతనాలు తప్పదోవ పట్టి ఉండవచ్చు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరికైతే వారికి చెందాల్సిన వేతనాలు ఇవ్వకుండా డాట్ సభ్యులు జల్సాలు చేసుకుంటారు. ఇకనయినా ఉన్నత స్థాయి అధికారులు టీవీ, సినిమా అసోసియేషన్ల పై దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని కొందరు డబ్బింగ్ కళాకారులు కోరుతున్నారు.
