పల్నాడు జిల్లా దాచేపల్లిలో బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. గత సంవత్సరంలో బోనాల పండుగను నామ మాత్రంగా నిర్వహించారు. ఈ సంవత్సరం మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకోని పోతరాజులతో కలిసి అమ్మవారికి సమర్పించారు. బస్తీల్లో పోతరాజుల వీరాంగం, శివ సత్తుల పూనకాలతో వీధుల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోచమ్మ ఆలయాల్లో భక్తులు సందడిగా కనిపించారు. బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.