పల్నాడు జిల్లా / దాచేపల్లి : దాచేపల్లిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో లేడీ ట్రైనీ డాక్టర్ పై ఈ నెల 9వ తారీఖున జరిగిన అత్యాచార ఘటనకు యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురైంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడే విధంగా బాధిత మహిళా కుటుంబానికి న్యాయం జరిగే విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు దాచేపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంఘీభావ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు.
నారాయణపురంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద నుండి క్యాండిల్ తో నిరసన ర్యాలీ గా వెళ్లి కారంపూడి రోడ్డు వద్ద అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారి పై మానవహారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు అనేక రాష్ట్రాల్లో మహిళలను అతి కిరాతకంగా పాశికంగా అత్యాచారం చేసి హత్య చేస్తున్నారని ఎన్ని చట్టాలు వచ్చినా మానవ మృగాల మహిళల పట్ల పైశాచకాన్ని చూపుతూ ఆడబిడ్డలను పొట్టణ పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళ ను తిరిగి తీసుకుని రాలేం కాబట్టి, వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి, రానున్న రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు త్వరితగతిన విధించాలని ప్రభుత్వాలను కోరారు.
ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా దాచేపల్లి పట్టణంలోని ప్రవేట్ హాస్పిటల్ వైద్యులు వరలక్ష్మి, కృష్ణ ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, నిషాంత్, సాయి కర్ణ, కుమార్, అలేఖ్య, విక్రాంత్, రఘు ప్రసాద్, దాచేపల్లి పట్టణ 14వ వార్డు కౌన్సిలర్ షరీఫ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పరిమి బాబు, జర్నలిస్టులు పాల్గొన్నారు