- కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారింది అధికారులు పనితీరు..!!
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని నడికుడి నుంచి గోగులపాడు వెళ్లే రహదారిలో రైల్వే గేట్ పక్కనే వారిని చూస్తే పెద్ద పెద్ద బావులను తలపిస్తున్నాయి
మైనింగ్ శాఖ నుంచి అనుమతులు గోరంత, తవ్వేది కొండంత అన్న చందంగా మారింది, ఈ క్వారీ పరిస్థితి..!
ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు క్వారీని ఇష్టారాజ్యంగా తవేస్తుండడంతో 50 నుంచి 70. అడుగుల బావులుగా కనిపిస్తున్నాయి..!!
ఓ పక్క రైల్వే ట్రాక్ ఉంది మరోపక్క జగనన్న కాలనీ ఉంది కూతవేటు దూరంలో మధ్యలో క్వారీ ఉండడంతో
ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందని భయభ్రాంతులకు గురవుతున్న జగనన్న కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు
అంతకంటే మించిన ప్రమాదం మరొకటి ఓ పక్క రైల్వే ట్రాక్ ఉండడంతో క్వారీలో బలమైన బ్లాస్టింగ్ లు జరగడంతో ఇప్పటికే రైల్వే ట్రాక్ కనీసం పది సార్లు వైబ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది..!!