బౌద్ధ గురువు దలైలామా గొప్పతనంతో పాటు భారత సైన్యం విశిష్టతను చాటి చెప్పేలా సోమవారం జరిగిన ఓ ఘటనను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బౌద్ధ మత గురువు దలైలామా తన పర్యటనలో భాగంగా బయలుదేరుతూ తనకు వీడ్కోలు పలికేందుకు నిలుచున్న భారత సైనికుడొకరికి సెల్యూట్ చేశారు. అంతేకాకుండా తనకు సెల్యూట్ చేస్తూ నిలుచున్న ఆ భారత సైనికుడిని తన వద్దకు రమ్మని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దలైలామా పిలుపుతో ఆయన వద్దకు వెళ్లిన భారత సైనికుడు ఆయన చేతిని ముద్దాడి… దలైలామాపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
A noble gesture by His Holiness the @DalaiLama Ji as he stops to salute an Indian 🇮🇳 soldier.
Compare this with the doubts that many keep raising about the achievements of our armed forces.#IndianArmy #ArmedForces pic.twitter.com/uNFCUYlB8p
— Hardeep Singh Puri (@HardeepSPuri) July 11, 2022