హైదరాబాద్: దళారి మూవీ ప్రమోషన్ లో భాగంగా దళారి టీం హీరో షకలక శంకర్, ఆక్స ఖాన్ హీరోయిన్, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి,లైన్ ప్రొడ్యూసర్ అనిల్ రెడ్డి లు మల్లారెడ్డి కాలేజీలో సందడి చేశారు. విద్యార్థులంతా ఏకమై టీజర్ చూసి తమ ఫోన్లలో లైట్స్ వేసి తమ సపోర్ట్ తెలియజేశారు, హీరోయిన్ ఆక్సా ఖాన్ మొట్టమొదటిసారి కాలేజీకి వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కాలేజ్ సెంటిమెంట్‌గా ప్రమోషన్ ఈ కాలేజీలో జరుగుతే సినిమా హిట్టే అని శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడుతూ ఆక్సా ఖాన్ హీరోయిన్ గా ఎదగడం ఆ హీరోయిన్ గా ఆక్సా ఖాన్ ను నేనే పరిచయం చేయడం చాలా సంతోషం ఉందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు భరత్ అఖిల్ అజయ్ మరియు హీరో షకలక శంకర్, ఆక్సా ఖాన్ ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి ,డైరెక్టర్ గోపాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ అనిల్ రెడ్డి,భవ్య తదితరులు పాల్గొన్నారు.
