మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటిలోని దళిత వాడల్లో రోడ్లు అద్వానంగా మారాయి. గత 25 సంవత్సరాల క్రితం రోడ్లు వేయగా, నేడు పూర్తిగా ద్వంసం అయ్యి గుంతలు ఏర్పడి దారుణంగా ఉన్న అధికారంలో ఉండి ఓ దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ, అదే ప్రాంతంలో ముగ్గురు కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తో పాటు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సైతం అదే ప్రాంతంలో ఉంటున్నప్పటికీ పట్టించుకునే వారు లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో రోడ్లు లేని కారణంగా అంబులెన్సులు కూడా రావడం లేదని, కనీసం ఆటోలు రావాలంటే 100 నుండి 150 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ పరిధిలోనే దళిత వాడలు ఉన్నట్లు గుర్తించి నాయకులు, అధికారులు నాళాలు, రోడ్లు వేయించాలని దళితులు కోరుతున్నారు.