హైదరాబాద్: బీఆర్ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. బీఆర్ఎస్ వచ్చినా తెలంగాణపై పేటెంట్ తమదే అని స్పష్టం చేశారు. పవర్ ఢీ సెంట్రల్ అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తామే ఉండాలనే దోరణిలో ఉన్నారని… దానికి కేసీఆర్ చరమ గీతం పడతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.
