కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: మండల కేంద్రం గన్నేరువరం లోని ఏడవ వార్డులో రహదారి పక్కన గేటు వాల్ గుంత ప్రమాదకరంగా మారింది. గ్రామంలో నీటి సరఫరాకు సంబంధించి గేట్ వాల్ కోసం గొంతును ఏర్పాటు చేశారు. కానీ దాన్ని పై సిమెంట్ బిళ్ళతో కప్పు వేయకపోవడంతో ఇటీవల ఒక టాక్టర్ అందులో ఇరుక్కుపోయింది, దీంతో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆ ట్రాక్టర్ ఓనర్ వద్ద జరిమానాను వసూలు చేశారు. అయినా ఆ గేటు వాళ్ళ గుంత పై ఎలాంటి కప్పు వేయకుండా యధావిధిగా వదిలేశారు. ఆ గేటు వాళ్లు గుంత చుట్టూ గడ్డి పెరగడంతో వాహనదారులకు ఆగుపడడం లేదు. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని అటువైపు నుంచే వెళ్లి ప్రయాణికులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.