- ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్
సిద్దిపేటజిల్లా :బెజ్జంకి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం” నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్ ,సర్పంచ్ శ్రీమతి ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్ తో కలిసి మొక్కలు నాటారు.
ఆనంతరం ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల లక్ష్మణ్ గారు మాట్లాడుతూ “గ్రీన్ కవర్ పెంచటం లో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందని,రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచటానికి , అడవుల పునరుద్దరణ కు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో తెలంగాణ హరిత తెలంగాణ గా విరాజిల్లుతుందని , ఆకుపచ్చని తెలంగాణ నీ ఆవిష్కరించటమే లక్ష్యంగా ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్ర తెలంగాణ” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గుబిరే శారదమాల్లేశం, ఎంపీటిసి ల ఫోరం మండల అధ్యక్షులు దుంబాల రాజా మహేందర్ రెడ్డి,బి.ర్.స్ పార్టీ మండల అధికార బోనగిరిశ్రీనివాస్ ,పంచాయితి కార్యదర్శి ప్రణీత్ రెడ్డి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.