హైదరాబాద్ : సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య(DCP Sai Chaitanya) బదిలీ(Transfer) చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్వర్వులు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్(Election Commission) ఆదేశాల మేరకు సాయి చైతన్యను డీజీ కార్యాలయానకి అటాచ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు వెలవరించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదని ఈసీ ఆదేశించింది.