- రేషన్ సరుకుల పక్కదారి పై తప్పు ఎవరిది ఎండియూ, డ్రైవర్లు
- రిపోర్టర్ టీవీ కథనం పై స్పందించిన అధికారులు
అల్లూరి జిల్లా, హుకుంపేట: లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ప్రశాంత్ కుమార్, రెవిన్యూ సిబ్బంది మండలంలోని పట్టం పంచాయతీ గంగూడి, బూరువలస గ్రామాల్లో పర్యటించారు. రేషన్ సరుకులు పక్కదారిపై చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ది రిపోర్టర్ టీవీ కథనం ప్రచురించింది . కథనానికి స్పందించిన అధికారులు గురువారం గంగూడి, బురు వలస గ్రామాన్ని సందర్శించి రేషన్ బాధితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా లబ్ధిదారులకు మార్చి నెల ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా పే స్లిప్ లో ఇచ్చినట్లు నమోదు చేసిన ఎండియు డీలర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ని బాధితులు కోరరు. సానుకూలంగా స్పందించి ఎమ్ డి యు డీలర్ల పై అసంతృప్తి వ్యక్తం చేశారు. రేషన్ సరుకులు కోత విధించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రేషన్ లబ్ధిదారుల వివరాలు తెలుసుకొని 20 మంది బాధితులను 350 కేజీల రేషన్ సరుకులను దగ్గరుండి పంపిన చేయించారు.14 మంది లబ్ధిదారులు పోరాటం ఫలితంగా ఇంకో నలుగురు లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందాయి. ఈ సందర్భంగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దారు ప్రశాంత్ కుమార్. మాట్లాడుతూ… రేషన్ సరుకులు లబ్ధిదారులకు ఇవ్వకుండా కోత విధిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రేషన్ సరుకులు సప్లై విషయంలో అవకతవకలపై ఎండియును తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. పే స్లిప్ తొలగించి ఈ పాస్ మిషిన్ ద్వారా వచ్చే స్లిప్పులని లబ్ధిదారులకి ఇవ్వాలని ఆయన సూచించారు. ఇకపై డిపోలో అవకతవకలు వస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునర్వతం కాకుండా బాధ్యత వహించాలని డీలర్లుకు ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ జి.రంగారావు.వీఆర్వో డి కొండబాబు,స్థానిక సర్పంచ్ కించాయి కృష్ణ.రెవిన్యూ సిబ్బంది లబ్ధిదారులు అప్పారావు, నూకరాజు, చిన్నయ్య, సుబ్బారావు, బాలన్న తదితరులు పాల్గొన్నారు.